Today Road Accidents in AP : విశాఖలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఉదయాన్నే పాఠశాల పిల్లలను తీసుకెళ్తున్న ఆటో.. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సంగం-శరత్ థియేటర్ జంక్షన్ వద్ద అతివేగంగా ఓ లారీని ఢీకొట్టింది. ఆ తీవ్రతకు ఆటో పల్టీ కొట్టగా అందులోని పిల్లలంతా పిట్టల్లా ఎగిరిపడ్డారు.
ఆటోలో ఉన్న ఎనిమిది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక ప్రజలు రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న విద్యార్థులను దగ్గరలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టిన లారీని సుమారు 100 మీటర్ల దూరం వెళ్లి ఆపారు. ఆటో అతివేగం, అటువైపు వస్తున్న లారీని చూసుకోకుండా ముందుకెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమైంది. అయితే... ఘటన జరిగిన సమయంలో లారీ వాళ్లదే తప్పని భావించిన స్థానికులు డ్రైవర్, క్లీనర్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం - ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు
Students Injured in Auto Overturn in Visakhapatnam : మరో ఘటనలో జిల్లాలోని మధురవాడ-నగరం పాలెం రోడ్డులో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధురవాడ నుంచి నగరంపాలెం వైపు వస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో ఆటోలో ఎనిమిది మంది విద్యార్థులు ఉండగా.. వారందరికి స్వల్పంగా గాయాలు అయ్యాయి.
మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వాహనాన్ని ఢీకొట్టిన లారీ - తప్పిన పెను ప్రమాదం
Two People Died Duo to Car Collided with Lorry in NTR District : ఎన్టీఆర్ జిల్లాలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మందిలో ఇద్దరు మృతి చెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు.
డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొట్టిన కారు : కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి సమీపంలో 216 నేషనల్ హైవేపై కారు డివైడర్‌ను ఢీ కొట్టిడంతో పల్టీలు కొట్టింది. తలకిందులుగా ఉన్న కారులో ఉన్న నలుగురిని స్థానికులు సురక్షితంగా బయటకు తీసారు. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. చిన్న చిన్న గాయాలు తప్ప పెద్ద గాయాలు అవలేదని ప్రయాణికులు తెలిపారు.
ద్విచక్ర వాహనానికి పూజ చేయించుకుని వస్తుండగా ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఇద్దరు స్నేహితులు మృతి