ఈనాడు పెళ్లిపందిరి వివాహ పరిచయ వేదికకు మంచి స్పందన - ఈనాడు పెళ్లిపందిరి ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక
ఈనాడు పెళ్లిపందిరి డాట్ నెట్ ఆధ్వర్యంలో విశాఖ వైశాఖి జల ఉద్యానవనంలో గౌడ, శెట్టి బలిజ వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వధూవరుల తల్లిదండ్రులు హాజరయ్యారు. వధూవరుల విద్యా, ఉద్యోగ తదితర వివరాలను ప్రకటించి తెరపై ప్రదర్శించారు. పరస్పరం ఒకరినొకరు కలుసుకునేందుకు అవకాశం కల్పించారు. హాజరైన వారికి ఆయా వధూవరుల వివరాలతో కూడిన సీడీ అందజేశారు.