ETV Bharat / state

పడవ మునిగిన ఘటనలో ముగ్గురి మృతదేహాలు వెలికితీత - jolaput reservoir boat accident victims at aob

పడవ మునిగిన ఘటనలో ముగ్గురి మృతదేహాలను ఓడ్రాఫ్ బలగాలు బయటకు తీశాయి. ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోని పాడువాలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. ఐదుగురు ఈదుకుంటూ వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు.

boat accident dead bodies
పడవ మునక ప్రమాద బాధితులు
author img

By

Published : Oct 29, 2020, 5:05 PM IST

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోని జోలాపుట్ జలాశయంలో పడవ మునిగిన ఘటనలో.. ముగ్గురి మృతదేహాలను ఓడ్రాఫ్ బలగాలు వెలికి తీశాయి. పాడువాకు చెందిన ఐదుగురు గ్రామస్థులు ఈదుకుంటూ బయట పడ్డారు. ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. మంగళవారం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు.

మంగళవారం సాయంత్రం మనోజ్ హొంతల్, బుధవారం ఉదయం ప్రశాంత్ ఖిల్లో, ఈరోజు ఉదయం చిత్రో ఖిల్లో దేహాలను బలగాలు బయటకు తీశాయి. ఒకే గ్రామంలో ముగ్గురు యుకులు మృత్యువాత పడటంతో.. ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:

భీమునిపట్నంలో 2 ప్రమాదాలు.. నలుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.