అరకులో..
విశాఖ మన్యంలోని అరకులోయలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఏజెన్సీ ప్రాంతం కావటంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. దీంతో ఓటు హక్కుని వినియోగించుకునేందుకు.. ఉదయం నుంచే గిరిజనులు భారీగా బారులు తీరారు.
పాడేరులో...
విశాఖ పాడేరు డివిజన్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మన్యంలోని 244 పంచాయతీలకు 237 పంచాయతీలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఒక పంచాయతీలో నామినేషన్ దాఖలు కాలేదు. ఆరు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మన్య కేంద్రమైన పాడేరు జూనియర్ కళాశాలలో 16 వార్డులకు.. ఒకే చోట పోలింగ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరకే పోలింగ్ జరగనుండటంతో.. ఓటు వేసేందుకుపెద్ద ఎత్తున గిరిజనులు బారులు తీరారు.
ఇదీ చదవండి: పంచాయతీ పోరు: ఉరవకొండ 3వ వార్డులో పోలింగ్ వాయిదా