విశాఖ మన్యం గూడెం కొత్తవీధి మండలం ధారాలమ్మ ఘాటీలో.. దోపిడి దొంగలు మరోసారి కలకలం సృష్టించారు. ధారాలమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తున్న .. బెన్నభూపాలపట్నానికి చెందిన ఇద్దరు భక్తులను తుపాకులు, కత్తులతో బెదిరించారు. అనంతరం వారి వద్ద నుంచి.. రూ. 15 వేలు నగదు, పావు తులం బంగారం, ఐఫోన్ లను లాక్కున్నారు.
వాహనంపై వెళుతుండగా..
నర్సీపట్నం మండలం బెన్నభూపాలపట్నానికి చెందిన 40 మంది భక్తులు.. శుక్రవారం వాహనాల్లో అమ్మవారి దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం భోజనాలు ముగించుకుని.. భక్త బృందంలో ఇద్దరు వ్యక్తులు సమీప ధారకొండలో బందువుల ఇంటికి ద్విచక్రవాహనం మీద బయలుదేరారు. ఆలయం నుంచి రెండు మలుపులు దాటేసరికి రహదారికి అడ్డంగా వెదురుబొంగులు ఉండగా.. వాహనాన్ని నెమ్మదించారు. ఒక్కసారిగా అయిదుగురు దుండగులు నాటుతుపాకులు, కత్తులతో వారిని బెదిరించి రు. వారి వద్దనున్న నగదు, బంగారం, ఇవ్వాలని ఒడియా బాషలో డిమాండ్ చేశారు. భయపడిన వాహనదారులు.. నగదు, బంగారం ఇచ్చేశారు. పట్టపగలే ఈ సంఘటన జరగడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి దారిదోపిడి దొంగలను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: