విశాఖలోని వాల్తేర్ డీజిల్ లోకో షెడ్.. సెన్సార్ ఆధారిత హ్యాండ్ వాష్, థర్మల్ స్కానింగ్, హ్యాండ్ శానిటైజర్ పంపిణీ పరికరాలను రూపొందించింది. లోకో షెడ్ సారథి సంతోష్ కుమార్ పాత్రో బృందం.. తాజాగా ఈ అవిష్కరణలను చేసింది. తాకకుండా ఈ పరికరాలను వినియోగించేలా ఏర్పాటు చేసి.. రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉంచారు.
ఆటోమెటిక్ హ్యాండ్ వాష్ బూత్, 12 వోల్టుల సొలోనోడ్ వాల్వ్, అల్ట్రాసోనిక్ సెన్సార్ కంట్రోల్ యూనిట్, స్విచ్ఛింగ్ పవర్ సప్లై యూనిట్లతో ఈ పరికరాన్ని రూపొందించారు. ఎల్సీడీ స్క్రీన్‌లో ఉష్టోగ్రత చూపేందుకు... థర్మల్ సెన్సార్ యూనిట్‌ని అల్ట్రాసొనిక్ సెన్సార్ కంట్రోల్ యూనిట్, స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లయ్ యూనిట్లతో కలిపారు. ఆటో హ్యాండ్ శానిటైజర్నూ ఇదే పరికరాలతో తయారు చేశారు.
వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ ప్రోత్సాహంతో.. డీజిల్ మెకానికల్ ఇంజనీర్ సంతోష్ కుమార్ పాత్రో ఈ పరికరాలను సిద్దం చేశారు. డీఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బూత్.. ఉద్యోగులు, సందర్శకులకు ఉపయోగంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ తరహాలోనే ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కుపరిశ్రమ భూములు దక్షిణ కొరియాకు అప్పగించటంపై వ్యతిరేకత