విశాఖలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆనందపురం, ఎంవీపీ, మూడో పట్టణం, గాజువాక, నాల్గో పట్టణ పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ నేరాలు జరిగినట్టు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు వివరించారు. మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో ఒక ఎమ్బీఏ విద్యార్థిని అరెస్ట్ చేశామన్నారు.
గాజువాకలోని ఇంటి దొంగతనం కేసులో ఐదు తులాల బంగారం, రూ.70 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. తాటిచెట్లపాలెంలో తెల్లవారు జామున ఇంట్లో దోపిడీకి యత్నించిన ఇద్దరిలో ఒకరిని అరెస్ట్ చేశామని, మరో వ్యక్తి పరారీలో ఉన్నారని తెలిపారు.
ఇదీ చదవండి : అన్నం పెట్టలేదని గొంతు నులిమి... భార్యని చంపేశాడు!