విశాఖలోని పెద జాలరిపేట ప్రాంతానికి భారీ మృత తిమింగలం కొట్టుకువచ్చింది. తిమింగలం చనిపోయి నాలుగైదు రోజులు దాటి ఉంటుందని జాలర్లు అంచనా వేస్తున్నారు. తిరిగి సముద్రంలోకి దానిని బోట్ల సాయంతో వెళ్లేలా చేశారు. భారీ బోటు ఢీ కొనటం వల్ల ఈ తిమింగలం చనిపోయి ఉంటుందని చెబుతున్నారు. మృత తిమింగలాన్ని చూసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.
విశాఖలోని జలారీపేట తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం