రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి విశాఖ కస్టమ్స్ డివిజన్ కార్యాలయం కృషిచేస్తోందని అసిస్టెంట్ కమిషనర్ ఎన్.రవిశంకర్ తెలిపారు. స్కూళ్లలోని విద్యార్థుల కనీస సదుపాయాల మెరుగుపరచడానికి స్వచ్ఛభారత్ నిధులను కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిధులతో రోలుగుంట మండలం జానకీరాంపురం ప్రభుత్వ పాఠశాల్లో నిర్మించిన తాగునీటి పథకాలు, మరుగుదొడ్లను రవిశంకర్ లాంఛనంగా ప్రారంభించారు.
తమ శాఖ ముఖ్య కమిషనర్ పీ.నరేష్ సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనిలో భాగంగానే ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ ప్రాంతంలోనూ, విజయనగరం జిల్లా గజపతినగరంలోనూ పలు పాఠశాలల్లో ఈ తరహా సేవలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ప్రతియేటా మూడు ప్రాంతాలను ఎంపిక చేసి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి:
PCA CHAIRMAN: రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్