విశాఖ జిల్లా పెందుర్తి లో నివాసాల మధ్య మార్చురీ నిర్మించవద్దని స్థానికులు ఆందోళన నిర్వహించారు. పెందుర్తి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేయనున్న వద్దని నిరసన చేపట్టారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన సమయంలో... ప్రజల అభీష్టం మేరకు వేరే చోటకి తరలిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు ఇక్కడ నిర్మించడం ఏమిటని ప్రశ్నించారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలకు దిగువ ప్రాంతాలకు మార్చురీ వల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నిర్మాణం చేపడితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వెంటనే దీన్ని ఆపాలంటూ హాస్పిటల్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు
ఇదీ చదవండీ...ఇబ్రహింపట్నంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ