విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం లోని అచ్యుతాపురం మండలం పూడిమడకలో సముద్రం బాగా ముందుకు వచ్చింది. కెరటాలు 100 నుంచి 150 మీటర్లు ముందుకు రావడం వల్ల తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల ఇళ్లు కోతకు గురవుతున్నాయి. ఒడ్డున లంగరు వేసిన పడవలు సముద్రంలోకి కొట్టుకుపోతున్నాయి. ఎగిసిపడుతున్న కెరటాల కారణంగా పూడిమడక, కడప పాలెం, కొండ పాలెం, జాలరిపేట గ్రామాలు కోతకు గురవుతున్నాయి. దీంతో పూరి గుడిసెల ముందు ఇసుకబస్తాలు అడ్డుపెట్టుకొని కెరటాల తాకిడిని నుంచి మత్స్యకారులు తమ పూరిగుడిసెలను కాపాడుకుంటున్నారు. ఇక్కడ తీరాన్ని ఆనుకొని 20 వేల మంది జనాభా జీవిస్తున్నారు. ఇప్పటికే కొన్ని మత్స్యకారుల గ్రహాలు సముద్రంలో కలిసిపోయాయి. ప్రతి యేటా సముద్రం ముందుకు రావడం ఇక్కడ వారిని ఇబ్బంది కలిగించే అంశంగా మారింది.

ఇవీ చూడండి...