ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మానుకోవాలని సీఐటీయూ విశాఖ నగర అధ్యక్షుడు కుమార్ డిమాండ్. మహా విశాఖ నగర పాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న రిలే దీక్షలు 32 వ రోజుకు చేరుకోగా.. ఆయన వారికి సంఘీభావం తెలిపారు.
విశాఖ ఉక్కు కర్మాగారం కరోనా రోగుల కోసం ఆక్సిజన్ను టన్నులకొద్దీ అందిస్తోందని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల కొరత కారణంగా.. ఇప్పటికే 1000 బెడ్స్ పంపిణీ చేసిందని గుర్తు చేశారు. ఇలాంటి పరిశ్రమను ప్రైవేటు కంపెనీలకు విక్రయిస్తే విశాఖ ప్రజలు చూస్తూ ఊరుకోరని కేంద్రాన్ని హెచ్చరించారు. కేరళ, బంగాల్ రాష్ట్రాల ఓటర్లు భాజపాకు బుద్ధి చెప్పారని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: