మన్యంలో కురుస్తున్న వర్షాలకు ప్రధాన మత్స్య గెడ్డ జి.మాడుగుల, పాడేరు పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో ఉరకలు వేస్తుంది. పాడేరు మండలం రాయగడ వంతెనపై నీరు ప్రవహిస్తుంది. దీంతో కొండ దిగువన ఉన్న పల్లపు వరినాట్ల భూములు నీట మునిగాయి. లింగా పుట్టు వద్ద కల్వర్టు కోతకు గురై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. పెదబయలు మండలం ఇంజరిబ గెడ్డ పొంగిపొర్లగా....జి.మాడుగుల మండలం మద్దిగరువు కల్వర్టు కొట్టుకుపోయి నాలుగు రోజులు అవుతున్న రాకపోకలు పునరావృతం కాలేదు. బోయితలి, కిల్లంకోట పంచాయతీల గ్రామాలతోపాటు ఒరిస్సా కూడా రాకపోకలు నిలిచిపోయాయి. కొండల నడుమ ప్రవహిస్తున్న గడ్డలకు పరిసర గ్రామాలకు వెళ్లేందుకు గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మన్యంలో గత పది రోజులు నుండి వర్షం కురుస్తోంది.
ఇదీచూడండి.ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి : వైద్యులతో కలెక్టర్