విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయం నుంచి దిగువ సాగునీటి కాలువకు నీటి విడుదల సామర్థ్యంపెంచారు. ఇప్పటివరకు దిగువ కాలువకు 20 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టేవారు. ఖరీఫ్ సీజన్ దరిచేరడంతో రైతుల విజ్ఞప్తి మేరకు.. దిగువ సాగునీటి కాలువకు నేటి నుంచి 30 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు జలాశయం ఏఈ జయరామ్ చెప్పారు. మరోవైపు ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి జలాశయాలోకి 30 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, ప్రస్తుతం 94.35 మీటర్ల మేరకు ఉంది.
ఇదీ చదవండీ.. వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన కేసులో.. ఆరుగురు అరెస్టు