నాడు ఉత్తమ రైతుగా జిల్లా స్థాయి అవార్డు పొందిన ఆయనకు కాలం కలిసి రాలేదు. పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవాల్సి వచ్చింది. కడప జిల్లా వేంపల్లి మండలం నేలవరం తండాకు చెందిన రైతు సబావత్ రామ్లానాయక్ దీనస్థితి ఇది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. కడప జిల్లా ఉత్తమ రైతుగా ఆయన ఎంపికై అవార్డును అందుకున్నారు. నాలుగెకరాల్లో అరటి, బొప్పాయి సాగు చేసి అద్భుత ఫలితాలను సాధించారు. అలాంటి రైతు.. ఉన్న ఊరిని కాదని దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నానికి వచ్చారు. కుటుంబ ఆదాయం కోసం ఎండు చేపలు కొని స్వగ్రామానికి తీసుకెళ్తున్నారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్ సమీపంలో ఫుట్‌పాత్‌పై ఉన్న రామ్లానాయక్ తన ఆవేదనను వినిపించారు.
‘నాకు ప్రభుత్వమే నాలుగెకరాలను ఇచ్చింది. ఏ పంటనైనా పండిస్తా. పొలంలో బోరు నుంచి ఆరేళ్లుగా నీరు రావడం లేదు. ఇల్లు గడవడం కష్టమవుతోంది. ‘డ్రిప్’ దెబ్బతింది. భార్యతో కలిసి గ్రామాల్లో తిరుగుతూ ఎండు చేపలు అమ్ముతున్నా. వాటిని ఇక్కడే కొని తీసుకెళతా’.
-సబావత్ రామ్లానాయక్, రైతు.
బోరులో నీరుంటేనే తాను రైతునని, లేదంటే కూలీనని వాపోయారు.
ఇదీ చదవండి: