విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయం పరివాహక ప్రాంతం పర్యాటకులను కట్టిపడేస్తోంది. చక్కని అందాలతో కనువిందు చేస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ జలాశయం నిండుకుండలా మారింది. ఈ జలాశయ ప్రాంతాన్ని సాగునీటి పరంగానే కాకుండా పర్యాటకంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని సుమారు 52 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నర్సీపట్నం నియోజకవర్గంలో రెండు కొండల మధ్య ఈ జలాశయం నిర్మాణం చేశారు. సాగునీటి పరంగా విశాఖ జిల్లాలో మేజర్ ప్రాజెక్టుగా ఈ తాండవ జలాశయం గుర్తింపు పొందటం విశేషం. సమీపంలోని నల్ల కొండమ్మ తల్లి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, పూల మొక్కల పార్కులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇదీ చదవండి :