విశాఖ జిల్లా నాతవరం మండలంలోని తాండవ జలాశయం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జలాశయం గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధమయ్యారు.
తాండవ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా... ప్రస్తుతం 379 అడుగుల మేర నీరు నిలకడగా ఉందని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. మరలా వర్షాలు పడే అవకాశం ఉండటంతో జలాశయం గేట్లు ఎత్తే ఆలోచన ఉందని... ఇందుకు తగ్గట్టుగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదీ చదవండి