విశాఖ జిల్లా వంటర్లపాలెం వద్ద తాచేరు నది గట్టు కోతకు గురైంది. ఈ నది గ్రామం పక్కనుంచే ప్రవహిస్తోంది. వర్షాలు తగ్గినా.. వరదనీటి ఉద్ధృతి ఆగలేదు. ఊరిలో రాకపోకలు సాగించే మార్గం నదికి ఆనుకుని ఉండటంతో రోడ్డు కూడా కోతకు గురైంది. దీంతో ప్రజలు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
తక్షణమే అధికారులు స్పందించి కోతకు గురైన గట్టు, తారురోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. నదిలో ప్రవాహం వల్ల ఎలాంటి ఆపద కలగకుండా రక్షణ గోడ నిర్మించాలంటున్నారు.