విశాఖ జిల్లా అనకాపల్లి ఏఎంఎఎల్ కళాశాల డిగ్రీ విద్యార్థులు.. చిన్న వయసులో పెద్ద మనసు చాటుకున్నారు. తమ తోటి విద్యార్ధి తండ్రికి మెదడులో రక్తం గడ్డ కట్టి.. చేయి పనిచేయడం లేదని తెలిసి బాధపడ్డారు. సాయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఆపదలో ఉన్న వారికి తోచిన ఆర్థిక సాయం చేయడానికి వారంతా.. గతంలోనే ‘సాయానికి పది రూపాయలు’ పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే సంఘం ద్వారా విరాళాలు సేకరించారు. పాకెట్ మనీ జమ చేసి 10 వేల రూపాయలు పోగేశారు. స్నేహితుడి కుటుంబానికి అందించారు. వారి సేవాగుణాన్ని అంతా ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి: