విశాఖలోని సింహగిరిపై నిత్యం క్లీన్ డ్రైవ్ చేపట్టాలని ఆలయ ఈవో సూర్యకళ.. సిబ్బందిని ఆదేశించారు. ఆలయంలో తనిఖీలు నిర్వహించిన ఆమె… స్వామివారి సేవలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కల్యాణ మండపం, బేడా మండపం, స్వామికి రోజువారీ అలంకరణ వంటివి పరీక్షించారు. నిత్య కల్యాణంతో పాటు స్వామివారి సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులకు చూపిస్తున్నామని… ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ కొత్తగా అలంకరణలు చేస్తున్నామని ఏఈఓ రాఘవ కుమార్.. ఈవోకు వివరించారు.
స్టాఫ్ అటెండెన్స్, గ్రిల్స్ పాలిషింగ్, నృసింహ అవతారాలను ప్రత్యేక తైలంతో శుభ్రపరచడం ఇలా ప్రతీ అంశాన్నీ ఈవో సూర్యకళ పరిశీలించారు. ఆలయం గురించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. సింహాచలం ఆలయ విశిష్టత, ప్రాశస్త్యం భక్తులందరికీ తెలియాలన్నారు. వీటిపై పుస్తకాలను ప్రింట్ చేసి... కౌంటర్లలో పెడతామని ఆమె చెప్పారు. ఆలయంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చలు జరిపారు.
ఇదీ చదవండి: