గడిచిన 16 నెలలుగా విశాఖ జిల్లా గాజువాక వైకాపా నేతలు విచ్ఛలవిడిగా భూ అక్రమణలకు పాల్పడుతున్నారని ఆ ప్రాంత తెలుగుయువత ఇంఛార్జ్ మెుల్లి పెంటిరాజు ఆరోపించారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.
కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినప్పటికీ స్థానిక తహసీల్దార్లు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహించారు. వైకాపా నేతలకు అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: