విశాఖ జిల్లా పాడేరులో మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనాన్ని అడ్డుకున్న నర్సుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. వేతనాలు అడిగిన నర్సులపై మంత్రి పోలీసులతో దౌర్జన్యం చేయించిన తీరును ఆమె ఖండించారు. కారు దిగి ఆందోళన ఎందుకో అడిగే తీరిక కూడా మంత్రికి లేదా అని నిలదీశారు. చేసిన కష్టానికి నర్సులు వేతనాలు అడిగారే తప్ప.. ప్రభుత్వ పెద్దలు దోచుకున్న సొమ్ము అడగలేదన్నారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడిన నర్సులకు నాలుగు నెలలుగా జీతాలివ్వకపోడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించకపోవటం దుర్మార్గమని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి...