ETV Bharat / state

మద్యం దుకాణాల ముందు 'గురువులకు' విధులా..? - అనకాపల్లిలో లాక్​డౌన్ ప్రభావం

విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయులు.. మందుబాబులను కట్టడి చేస్తున్నారు. పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థితికి చేర్చాల్సిన టీచర్లు... నేడు మద్యంప్రియులు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపడుతున్నారు. ఇలా ప్రభుత్వం తమను మద్యం దుకాణాల ముందు విధులు కేటాయించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Teachers are embarrassed about assigning duties at wine shops in anakapalli vishakhapatnam
ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయుడు
author img

By

Published : May 5, 2020, 8:59 AM IST

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు విధులు కేటాయించడం... పలు విమర్శలకు దారి తీస్తోంది. కరోనా లాక్​డౌన్​లో భాగంగా సేవలు అందించాలని ఉపాధ్యాయులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. సోమవారం నుంచి మద్యం దుకాణాలు తెరవడంతో మద్యం ప్రియులను కట్టడి చేసే బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పజెప్పారు. దీనిపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీచదవండి.

మన్యంలో భారీ వర్షం... నేలకొరిగిన వృక్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.