కరోనా నివారణలో భాగంగా రెడ్ జోన్‌గా ప్రకటించిన కృష్ణలంక ప్రాంతంలో బుధవారం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సొంత నిధులతో కార్యక్రమం చేస్తున్నట్లు స్థానిక తెదేపా డివిజన్ అధ్యక్షుడు రత్నం రమేష్ తెలిపారు. ఎమ్మెల్యే సహాయం అందిస్తామన్నా... ప్రభుత్వం తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం సహకరిస్తే 24 గంటల్లో విజయవాడ నగరం అంతా చల్లిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :