వైకాపా ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు పై.. తెదేపా ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు ఎస్ఈసీకీ ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా రాంబిల్లి మండలంలోని పంచాయతీ ఎన్నికల అభ్యర్థులను.. ఎమ్మెల్యే బెదిరించారని ఫిర్యాదు చేసినట్లు చలపతిరావు వెల్లడించారు.
లాలం కోడూరు పంచాయతీని ఏకగ్రీవం చేసేందుకు.. వార్డు సభ్యుడి అల్లుడిని బెదిరించారన్నారు. ఈ విషయంపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేసినా.. అరెస్టు చేయలేదన్నారు. ఆ విషయాన్ని సైతం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: పంచాయతీ పోరు: మూడో దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం