గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని కోరుతూ... విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు లబ్ధిదారులతో కలిసి ఆందోళన నిర్వహించారు. నిర్మించిన ఇళ్లను ఇప్పటి వరకు కేటాయించకపోవటం దారుణమన్నారు. సొంతిటి కల నెరవేరబోతుందని ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఇళ్లస్థలాల పంపిణీలో అర్హులైన లబ్ధిదారులను తొలగించి అనర్హులకు చోటు కల్పించారని మండిపడ్డారు. బీఎల్సీ స్కీంలో కట్టిన ఇళ్లకు ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
'తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలి' - తెదేపా నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలి
గత ప్రభుత్వహయాంలో నిర్మించిన ఇళ్లను ఇప్పటి వరకు లబ్ధిదారులకు కేటాయించకపోవటం దారుణమని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు విమర్శించారు. ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

'తెదేపా హయంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలి'