సీఎం జగన్ ప్రజా సంకల్పానికి మూడేళ్లు పూర్తైనా.. ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చలేదని ఎమ్మెల్యే గణబాబు విమర్శించారు. ప్రజలకు ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. మాస్కులు, హెల్మెట్లు లేకుండా ర్యాలీలకు ఎలా అనుమతిస్తోందని నిలదీశారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చనపుడు.. ఏ మొహం పెట్టుకుని సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం అని చెప్పి ధరలు పెంచడమే కాక.. ధరలు పెంచబోమని చెప్పి మరీ విద్యుత్తు, ఆర్టీసీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని గణబాబు ఆక్షేపించారు.
ఇదీ చదవండి: