విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల గెలుపే లక్ష్యంగా తెదేపా పని చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం రాత్రి నిర్వహించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి రామానాయుడు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై జీవీఎంసీలోని అన్ని డివిజన్ల పార్టీ కార్యకర్తలు, అభ్యర్థులకు సీనియర్ నేతలు దిశానిర్దేశం చేశారు.
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తెదేపా కంచుకోటగా రామానాయుడు అభివర్ణించారు. ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండీ నజీర్, విశాఖ పార్లమెంటరీ పార్టీ నాయకులు భరత్, ఇతర నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: