ETV Bharat / state

'చంద్రబాబుకు మంత్రి ధర్మాన బహిరంగ క్షమాపణ చెప్పాలి'

ఉప ముఖ్యమంతి ధర్మాన కృష్ణదాస్... తమ అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని శ్రీకాకుళం జిల్లా పాలకొండలో తెదేపా నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తూ... ప్రతిపక్షనేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు.

చంద్రబాబుకు తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలి

author img

By

Published : Oct 4, 2020, 4:54 PM IST

తెదేపా అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసుకు వ్యతిరేకంగా... శ్రీకాకుళం జిల్లా పాలకొండలో తెదేపా నాయకులు ఆందోళన నిర్వహించారు. నియోజకవర్గ బాధ్యుడు నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో నేతలు ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అనంతరం కృష్ణదాసుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ... ఎం.ఎం.నగర్ కూడలి వద్దనున్న గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. రాష్ట్రమంత్రిగా వ్యవహరిస్తూ...ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని జయకృష్ణ హితవు పలికారు. చంద్రబాబుకు తక్షణమే ధర్మాన.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

కాకినాడ సెజ్ కొనుగోళ్లపై కేంద్రం దర్యాప్తు జరపాలి: యనమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.