ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా గాజువాకలోని తెదేపా కార్యాలయం వద్ద తెదేపా నేతలు అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పల్లా శ్రీనివాసరావు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. వారికి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు సంఘీభావం తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేంతవరకు తమ ఆమరణ నిరహార దీక్ష కొనసాగుతుందని పార్టీ నాయకుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో దీక్షకు హాజరయ్యారు.
ఇవీ చూడండి:
'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ'పై.. హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్