ETV Bharat / state

ఐదు రూపాయలకే కేజీ ఇసుక

'రండి బాబూ రండి ఇక్కడ కేజీ ఇసుక 5 రూపాయలే' అంటూ అమ్మేవారు. '5 రూపాయలా.. ఇంకేమి తగ్గేది ఉండదా' అంటూ కొనేవారు. ముందు రండి స్వామి తర్వాత చూద్దాం అంటూ కేకలు.  ఏంటిది అనుకుంటున్నారా! కొత్త ప్రభుత్వ ఇసుక విధానంపై తెదేపా నేతల ఆందోళన తీరిది.

author img

By

Published : Aug 30, 2019, 3:50 PM IST

Updated : Aug 30, 2019, 4:51 PM IST

'రండి.. రండి.. ఇసుక కేజీ 5 రూపాయలే'
'రండి.. రండి.. ఇసుక కేజీ 5 రూపాయలే'

రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ తెదేపా కార్యకర్తలు విశాఖ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. కూరగాయల్లా ఇసుకను కేజీల లెక్కన అమ్ముతూ.. బేరాలాడుతూ ఆందోళన చేశారు. 'నోట్లో మట్టి కొట్టు పాత సామెత-నోట్లో ఇసుక కొట్టు అనేది కొత్త సామెత' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇసుక కొరత వల్ల సుమారు 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. వైకాపా ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ దిగజారిందని విమర్శించారు. ఇసుక రీచుల్లో వైకాపా కార్యకర్తలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక సమస్యను త్వరలోనే పరిష్కరించేలా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..

'ఇద్ది రద్దుల ప్రభుత్వం'

Intro:కె.శ్రీనివాసు,
కంట్రిబ్యూటర్,
నరసాపురం,
నోట్....ap_tpg_31_30_tdp_andolan_avb_ap10090 file ku script మరల పంపిచాను పరిశీలించాను. పరిశీలించ గలరు.

ap_tpg_32_30_tdp_andolan_script_ap10090

Body:యాంకర్.. ఇసుక సమస్యపై తేదేపా చేపట్టిన శాంతియుత ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు గృహనిర్బంధం చేశారు దీంతో తెదేపా శ్రేణులు ఆయన నివాసానికి చేరుకున్నారు ప్రజా సమస్యలపై శాంతియుతంగా చేస్తున్న ధర్నా అడ్డుకోవడం తగదని కోరారు పోలీస్ అంగీకరించకపోవడంతో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు ధర్నాకు బయల్దేరారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు ను అరెస్టు చేసి వాహనం లో తరలించడానికి ప్రయత్నించడం తో తెదేపా శ్రేణులు నిరసన వ్యక్తంచేశారు. పోలీసులు తీరును నిరసిస్తూ ప్రదర్శన గా అంబేద్కర్ కూడలి కి బయల్దేరారు.
దీంతో పోలీసు లు అడ్డుకోవడం తో తేదేపా శ్రేణులు కు మద్య తోపులాట జరిగింది. పోలీసులు మాజీ ఎమ్మెల్యే ను పోలీసు స్టేషన్ కు తరలించారు. దీంతో తెదేపా శ్రేణులు ఆందోళన చేశారు.

Conclusion:మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు.
Last Updated : Aug 30, 2019, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.