అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్యలపై... ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో తెదేపా నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల మృతికి కారకులైన వైకాపా నాయకులు, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సలాం కుటుంబసభ్యులకు కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని కోరారు.
ఇదీ చదవండి