ETV Bharat / state

'రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలం'

author img

By

Published : Aug 16, 2020, 3:33 PM IST

రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా నేత రామానాయుడు విమర్శించారు. గత ప్రభుత్వ పాలనలో రైతులు ఉపాధి హామీ పథకంలో షెడ్లు నిర్మించుకుంటే.. ఎందుకు బిల్లులు ఇవ్వలేదని ప్రశ్నించారు. వైకాపా పక్షపాత ధోరణితో పాలన చేస్తుందని మండిపడ్డారు.

TDP Leader Ramanaidu criticize YCP Government over not paying bills
రామానాయుడు

తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో పశువుల షెడ్లు మంజూరు చేయగా.. వాటిని రైతులు నిర్మించుకుంటే బిల్లులు ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామంలో రైతు ముర్రు స్వామినాయుడుకి చెందిన పశువులు పాక, పశువులు, గడ్డి మేట్లు, ధాన్యం ఇతర వ్యవసాయ పనిముట్లు ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. స్పందించిన రామానాయుడు బాధిత రైతును పరామర్శించారు. రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు.

ఇదీ చదవండీ... ఉద్ధృతంగా గోదావరి... వణికిపోతున్న ముంపు గ్రామాల ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.