ETV Bharat / state

tdp leader palla srinivasa rao fires on ycp: విజయసాయి, జీవీ ఇద్దరూ ఆడిటర్లే: పల్లా శ్రీనివాసరావు - tdp leader palla srinivasa rao

tdp leader palla srinivasa rao fires on ycp: విశాఖలో వైకాపా నేతల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. విశాఖ తెదేపా పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పారిశ్రామికవేత్తలను.. వైకాపా నేతలు భయబ్రాంతులకు గురిచేసి విశాఖకు పరిశ్రమలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ విజయసాయిరెడ్డి, స్మార్డ్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జీ.వెంకటేశ్వరావు ఇద్దరు ఆడిటర్లేనని విమర్శించారు. వీరిని చూసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని అన్నారు.

tdp leader palla srinivasa rao fires on ycp
విజయసాయి, జీవీ ఇద్దరు ఆడిటర్లే: పల్లా శ్రీనివాసరావు
author img

By

Published : Dec 20, 2021, 5:31 PM IST

tdp leader palla srinivasa rao fires on ycp: విశాఖలో వైకాపా నేతల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. గుత్తేదారు హయగ్రీవ జగదీష్ సెల్ఫీ వీడియో ఇందుకు ఉదాహరణ అని.. తెదేపా పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

పారిశ్రామికవేత్తలను.. వైకాపా నేతలు భయబ్రాంతులకు గురిచేసి, విశాఖకు పరిశ్రమలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. స్మార్డ్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జీ.వెంకటేశ్వరావుపై ఎన్నో అవినీతి ఆరోపణలు వస్తున్నాయని.. వెంటనే చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంపై విచారణ జరిపించి, జీవీ చేత రాజీనామా చేయించాలన్నారు. ఇలాంటి ఘటనలన్నీ విజయసాయి రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. విజయసాయి, జీవి ఇద్దరూ ఆడిటర్లేనని.. వీరి పనులు చూసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని విమర్శించారు. విశాఖకు పులివెందుల సంస్కృతి తీసుకొచ్చారని.. మునుపెన్నడూ ఇలాంటి దారుణాలు చూడలేదని, వినలేదని అన్నారు.

ఇదీ చదవండి:

COUPLE SUICIDE ATTEMPT: అప్పుల బాధ భరించలేక.. దంపతుల ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.