మాజీమంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైకాపాలో చేరే అవకాశముందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్ బుధవారం విశాఖలో వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జగన్ పాలన చూసి చాలా మంది వైకాపాలో చేరుతున్నారన్నారు. ‘గంటా శ్రీనివాసరావు కొన్ని ప్రతిపాదనలు పంపారు. జగన్ ఆమోదం తర్వాత గంటా పార్టీలోకి వచ్చే అవకాశముంది’ అని తెలిపారు.
మరో వైపు వైకాపాలో గంటా చేరిక ప్రతిపాదనను మొదటి నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్నారు. బుధవారం విశాఖలో జరిగిన కాశీవిశ్వనాథ్ వైకాపాలో చేరిక కార్యక్రమానికి అవంతి శ్రీనివాస్ దూరంగా ఉన్నారు. దీంతో విశాఖ వైకాపాలో వర్గపోరు మొదలైందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది?: సీపీఐ రామకృష్ణ