ETV Bharat / state

రేపు 'చలో నర్సీపట్నం'.. తెలుగుదేశం పిలుపు - తెదేపా చలో నర్సీపట్నం

ప్రశ్నించిన వారిపై దాడి చేయడం వైకాపాకు అలవాటుగా మారిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అయ్యన్న ఇంటిగోడను కూల్చడాన్ని నిరసిస్తూ.. రేపు "చలో నర్సీపట్నం" ఆందోళనకు తెదేపా పిలుపునిచ్చినట్లు ఆయన వెల్లడించారు.

చలో నర్సీపట్నం
చలో నర్సీపట్నం
author img

By

Published : Jun 19, 2022, 8:01 PM IST

అయ్యన్న ఇంటిగోడను కూల్చడాన్ని నిరసిస్తూ.. రేపు చలో నర్సీపట్నంకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. రాజకీయ కక్ష సాధింపుతో వైకాపా ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గతంలో పల్లా శ్రీనివాస్, సబ్బం హరి ఆస్తులపైనా దాడి చేశారని గుర్తు చేశారు. ప్రశ్నించిన వారిపై దాడి చేయడం వైకాపాకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. బీసీల పట్ల జగన్ చూపిస్తున్న కపట ప్రేమను నిలదీస్తామని అచ్చెన్న వ్యాఖ్యనించారు.

ఇదీ జరిగింది: అయ్యన్న పాత్రుడు పంటకాలువ ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారంటూ.. శనివారం అర్ధరాత్రి జేసీబీలతో ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించి నిర్మాణం చేపట్టారంటూ మున్సిపల్ సిబ్బంది నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్నపాత్రుడి కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

అయ్యన్నపాత్రుడి ఇంటి చుట్టుపక్కల అర్ధరాత్రి నుంచే.. విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపేశారు. అయ్యన్నపాత్రుడి వద్ద పనిచేసేవారు, నిత్యావసరాలు తీసుకొచ్చే వారిని కూడా.. పోలీసులు ఇంట్లోకి అనుమతించలేదు. అలాగే.. అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లే రెండు మార్గాలనూ పోలీసులు మూసివేశారు. మీడియాను ఆ పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు చేపట్టారు. నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలోనే పోలీసుల బలగాలు మోహరించారు.

అన్ని నియమాలకు లోబడే ఇంటి నిర్మాణం చేశామని.. ఇంటి గోడ ధ్వంసం చేయడంపై ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడి రెండో కుమారుడు రాజేష్‌ను పోలీసులు చుట్టుముట్టారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసులు, అధికారులతో.. అయ్యన్న కుటుంబం వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ నెల రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే తొలగించడంపై అయ్యన్న కుటుంబసభ్యులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే..: అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత ముమ్మాటికీ కక్ష సాధింపేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగుదేశంలో బలమైన బీసీ నేతలే లక్ష్యంగా సీఎం జగన్ అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చోడవరం మినీమహానాడు వేదికగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే అయ్యన్న ఇంటిపై చీకటి దాడులు చేయించారని చంద్రబాబు మండిపడ్డారు. అయ్యన్న ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ జగన్ సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరని ఆక్షేపించారు. అందువల్లే కూల్చివేతలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడికి మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.