విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు అవకతవకలకు పాల్పడ్డారని 68వ వార్డు తెదేపా అభ్యర్థి సర్వసిద్ధి అనంత లక్ష్మీ అన్నారు. తాను వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన ప్రాంతంలో పోలీసులు, ఎన్నికల అధికారులు.. వైకాపా నాయకులతో కుమ్మక్కై ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
మరణించిన, విదేశాల్లో స్థిరపడ్డ ఓటర్ల స్థానంలో వైకాపా అభ్యర్థులు వారి కార్యకర్తలతో దొంగ ఓట్లు వేయించారని అనంత లక్ష్మీ అన్నారు. అందుకు తగ్గ సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. జీవీఎంసీ అధికారులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తులని బతికించ గలిగే సామర్థ్యం ఒక్క వైకాపా నాయకులకే ఉందని అనంతలక్ష్మి ఎద్దేవా చేశారు. 68వ వార్డులోనే మరణించిన, విదేశాల్లో స్థిరపడ్డ సుమారు 500 మంది ఓట్లను వేయింటారు అంటే అది కేవలం దౌర్జన్యంతోనే చేయగలిగారని ఆరోపించారు. రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి రెండు రోజుల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం