శ్రామిక్ రైళ్ల ద్వారా తమ సొంత రాష్ట్రాలకు తరలి వెళ్లే వలస కూలీలకు సింబియాసిస్ సాఫ్ట్ వేర్ సంస్థ భోజన సదుపాయాలను కల్పించింది. విశాఖ రైల్వేస్టేషన్ వద్ద సింబియాసిస్ సీఈవో నరేష్ కుమార్, భాజపా నేతల ఆధ్వర్యంలో వలస కూలీలకు బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్లు, భోజనం, మంచినీటి బాటిల్, మాస్కుతో కూడిన కిట్లను అందజేశారు. ఉపాధి కోసం ఎంతో మంది వలస కార్మికులు తమ ఊర్లను వదిలి ఇక్కడకు వచ్చారని.., వారంతా కరోనా వ్యాధి కారణంగా ఉపాధి కోల్పోయి తమ గ్రామాలకు తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వారికి తమ వంతుగా తోచిన సహాయాన్ని అందజేస్తున్నామని వారు తెలిపారు.
ఇదీ చదవండి :