ఈ నెల 16న విశాఖలో దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నిర్వహించిన సమీక్షలో మాన్సాస్‌కు చెందిన అన్ని అంశాలపై విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో మాన్సాస్‌పై దేవాదాయశాఖ అధికారులు దృష్టిపెట్టారు. ట్రస్ట్ పరిపాలను గాడిలో పెట్టేందుకని పేర్కొంటూ వివిధ అంశాలపై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు పలువురు అధికారులకు బాధ్యతలు ఇచ్చారు.
వీరిలో దేవాదాయశాఖ అదనపు కమిషనర్ టి.చంద్రకుమార్, విజయనగరం సహాయ కమిషనర్ వినోద్‌కుమార్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్ (ఆర్‌జేసీ) ఎంవీ సురేష్‌బాబు, కాకినాడ ఉప కమిషనర్ ఎం.విజయరాజు, మాన్సాస్ ట్రస్టు ఈవో, దేవాదాయశాఖ కమిషనరేట్‌లోని న్యాయ సలహాదారు కె.సూర్యారావు ఉన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని వేణుగోపాలస్వామి ఆలయం, శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుల్ల సీతారామపురంలోని సీతారామస్వామి ఆలయ భూములను, ఆభరణాలు, స్థిర, చర ఆస్తులను దుర్గగుడి ఈవో భ్రమరాంబ, రాజమహేంద్రవరం ఆర్జేసీ సురేష్‌బాబు పరిశీలించనున్నారు.
ఆరోపణలు ఉన్నా.. బాధ్యతలు
మాన్సాస్ ట్రస్టుకు చెందిన వివిధ అంశాలపై అధ్యయనం చేసేందుకు నియమించిన అధికారుల్లో కొందరిపై ఆరోపణలు ఉన్నాసరే, వారికి బాధ్యతలు ఇవ్వడం ఆశాఖలో చర్చనీయాంశంగా మారింది. విశాఖ జిల్లాలోని ఓ చౌట్రీకి చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని లీజు పేరిట ఇతరులకు కట్టబెట్టేందుకు చూసిన ఓ అధికారి, ఉద్యోగులను వేధిస్తున్నారనే ఆరోపణలు ఎదురొన్న అధికారి, ఓ ప్రముఖ ఆలయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని ఏసీబీ పేరొన్న అధికారి.. ఇందులో ఉన్నారు.
ఇదీ చదవండి:
తితిదేకు త్వరగా నూతన బోర్డును ఏర్పాటు చేయండి.. కాలయాపన వద్దు'