విశాఖ జిల్లాలో సహకార రంగంలో ఉన్న మూడు చక్కెర కర్మాగారాలు 2019-2020 గానగ ఆటను ప్రారంభించనున్నాయి. ఇందులో భాగంగా గోవాడ చక్కెర కర్మాగారం గానుగ ఆటను ఆసిస్టెంట్ కేన్ కమిషనర్ జీవీవీ.సత్యనారాయణ ప్రారంభించారు. ఎండీ సన్యాశినాయుడుతో కలిసి కమిషనర్ సత్యనారాయణ కేన్ క్యారియర్లో చెరకు గడలను వేశారు. గోవాడ షుగర్స్ 4.5 లక్షల టన్నులు, ఏటికొప్పాక షుగర్స్ 80 వేల టన్నులు, తాండవ షుగర్స్ 90 వేల టన్నుల చెరకును ఈ ఏడాది గానుగ ఆట చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు సత్యనారాయణ తెలిపారు. మిగిలిన మూడు ఫ్యాక్టరీలు ఈ నెలాఖరు నాటికి గానుగ ఆటను మొదలుపెట్టనున్నాయి.
ఇదీచూడండి.విశాఖలో సబ్సిడీ ఉల్లి కోసం జనం పాట్లు