ETV Bharat / state

'ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం' - సబ్ కలెక్టర్ మౌర్య తాజా వార్తలు

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య చెప్పారు. లెక్కింపు ప్రారంభమైన మూడు గంటల్లో ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

sub collector mourya
'ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం'
author img

By

Published : Mar 12, 2021, 4:58 PM IST

ఈ నెల 14న చేపట్టనున్న మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య వెల్లడించారు. నర్సీపట్నం లోని 28 వార్డులకు గాను స్థానిక డిగ్రీ కళాశాల వద్ద కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. అన్ని వార్డుల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఒకేసారి పూర్తి చేసేలా తగిన ఏర్పాట్లు చేశామని.. ఫలితాలను లెక్కింపు ప్రారంభమైన మూడు గంటల్లోనే వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సబ్ కలెక్టర్ వివరించారు. పోటీ చేసే అభ్యర్థులతో పాటు పాత్రికేయులకు పరిమితులతో కూడిన అనుమతులు ఉంటాయని వాటిని అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు.

ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్‌ దేశంలో లేదా..? మాట్లాడకూడదా?: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.