మద్యం నిషేధంపై అవగాహన కల్పిస్తూ... విశాఖలోని ఏఎస్ రాజా కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నగరంలో అత్యధికంగా మద్యం సేవించే పెద్దజాలరిపేట వంటి ప్రాంతంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ చేశారు. మద్యపానం వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ... ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచిపెట్టారు. మద్యపానం ఒక మానసిక రుగ్మత అని... దీనికి చికిత్స ఎక్కడ చేయించుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాడేరు డివిజన్ అబ్కారీ ఎస్ఐ జ్ఞానేశ్వరి పాల్గొన్నారు.
ఇదీ చూడండీ:
'దిశకు న్యాయం జరిగింది'