చోడవరం-మాడుగుల నియోజవర్గాల గ్రామాలకు రవాణా సదుపాయం కల్పించేందుకు శారదా నదిపై గవరవరం వద్ద ఉన్న వంతెన 2012 లో కుంగిపోయింది. దీంతో 90 గ్రామాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కుంగిన వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి 2017లో రూ.15.4 కోట్లు విడుదలయ్యాయి. 2018 చివర్లో నిర్మాణ పనులనకు శ్రీకారం చుట్టారు. ఏడాదిలోగా వంతెన నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అప్పటి నాయకులు ప్రకటించారు. కాని ఇంకా వారథి పూర్తి కాలేదని ప్రజలు వాపోతున్నారు. 2012 నుంచి పడుతున్న రవాణా ఇబ్బందులను ప్రస్తుత అధికారులు, అధికార పార్టీ నాయకులైన గుర్తించి… వంతెన పూర్తి చేయాలని రెండు నియోజకవర్గాల ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: సముద్రంలో యువకుడు గల్లంతు