పురపోరులో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని.. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని.. విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య పేర్కొన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు ఇతర రాజకీయ పార్టీలతో నిర్వహించిన అవగాహన కారక్రమంలో.. సబ్ కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని.. వార్డుల్లో తగిన సూచనలు ఇవ్వాలని.. రాజకీయ పార్టీ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామినాయుడు, మున్సిపల్ కమిషనర్ కనకారావు తదితరులు పాల్గొన్నారు.