ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 29న ఒక రోజు సమ్మెకు స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గాలనే ప్రధాన డిమాండ్‌తో... సమ్మెకు పిలుపునిచ్చాయి.
కరోనా సమయంలో కొవిడ్ రోగుల ప్రాణాలు కాపాడటానికి 10 వేల మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను అందించిన స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం కనికరం చూపించాలని కోరారు. ఈ నెల 22 న దిల్లీలో స్టీల్ కార్యదర్శి, స్టీల్‌ప్లాంట్ సీఎండీతో జరిపిన దీపం చర్చలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇకపై అంచెలంచెలుగా జరగబోయే ఉద్యమంలో ప్రజలందర్నీ భాగస్వామ్యం చేస్తామన్నారు.
ఇదీ చదవండి: