విశాఖ జిల్లా తొట్లకొండ బౌద్ధ క్షేత్రం పరిధిలోని 20 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియపై హైకోర్టు యధాతథ స్థితి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భూమిని ఇళ్ల స్థలాల కోసం వినియోగించొద్దని అధికారులకు స్పష్టం చేసింది . ఆ ప్రాంతంలో నిర్మాణాలపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని అధికారులను ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
ఇదీచదవండి