విశాఖ ఏజెన్సీ పాడేరులో రాష్ట్ర శాసనసభ ఎస్టీ కమిటీ ఛైర్మన్ బాలరాజు అధ్యక్షతన కమిటీ సభ్యులు పర్యటించారు. అరకు పర్యటన ముగిసిన అనంతరం కమిటీ సభ్యులు నేరుగా పాడేరు మోదకొండమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాడేరు జిల్లా ఆస్పత్రికి వెళ్లి వైద్యం అందుతున్న తీరుతెన్నులు తెలుసుకున్నారు. ఇక్కడ పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని జేసీ లోతేటి శివ శంకర్‌ను కమిటీ ఛైర్మన్ బాలరాజు ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలు, వివిధ సంఘాల నుంచి రూల్ ఆఫ్ రిజర్వేషన్ల అమలుపై ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఇదీ చూడండి: