సింహాచలం దేవస్థానం పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మరో నలుగురిని పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ.. రాష్ట్ర దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. వాణీమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. మేడిద మురళీకృష్ణ, యండమూరి విజయ, దశమంతుల మాణిక్యాలరావు, ఎస్ఎ.న్.రత్నం వీరిలో ఉన్నారు. వీరు ప్రధాన ఉత్సవాలు, వేడుకల సమయంలో.. ఈవో, ట్రస్టుబోర్డుకు పరిపాలనపరమైన సహాయం అందజేయనున్నారు.
శ్రీనుబాబు దంపతుల విరాళం
ప్రత్యేక ఆహ్వానితుడిగా తనకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు.. శ్రీనుబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సింహాద్రి అప్పన్నను.. శ్రీనుబాబు దంపతులు దర్శనం దర్శించుకున్నారు. స్వామివారికి 3 కిలోల చందనం విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు రూ. 60,348 చెక్కును.. ఆలయ ఏఈఓ రాఘవ కుమార్‌కు అందించారు. కరోనా నేపథ్యంలో స్వామివారి చందనోత్సవం ఈ నెల 14న ఏకాంతంగా జరగనుందని.. అయినప్పటికీ చందనం విరాళం సమర్పించడం ద్వారా స్వామి కృపకు పాత్రులు కావచ్చని గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆలయాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ఇదీ చదవండి:
చిలకలూరిపేట చిన్నారి ప్రతిభ.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు!