ETV Bharat / state

ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థుల సాయం - గాంధీగ్రామంలో ఉన్న శ్రీ విజ్ఞాన్ స్కూల్ కు చెందిన పూర్వపు విద్యార్థులు

గురువర్యులారా! మీరేమి కలత చెందవద్దు. మీ అత్యుత్తమ బోధనతో మేము జీవితంలో స్థిరపడ్డాం. కరోనా కాలంలో జీతాల్లేక ఇబ్బందులు పడవద్దు మేమున్నామంటూ.. తమ ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్ధులు ఆర్థిక సాయం చేశారు. ఈ మహత్తర ఘట్టానికి నెలవైంది విశాఖ జిల్లా చోడవరం మండలంలోని శ్రీ విజ్ఞాన పబ్లిక్ స్కూల్.

vishaka district
ఉపాధ్యాయులకు పూర్వపు విద్యార్థులు సాయం
author img

By

Published : Jul 27, 2020, 9:00 PM IST

విశాఖ జిల్లా చోడవరం మండలం గాంధీగ్రామంలో ఉన్న శ్రీ విజ్ఞాన్ స్కూల్ కు చెందిన పూర్వ విద్యార్థులు ముఖ్యంగా 2004-11 మధ్య స్కూల్ లో చదివిన విద్యార్థులు అంతా చరవాణిల ద్వారా చేరువై రూ.3.75 లక్షల నగదును వసూలు చేశారు. ఈ నగదును తమకు బోధన చేసిన ఉపాధ్యాయులకు అందివ్వాలని తలిచారు. స్కూల్ అవరణలో జరిగిన ఓ కార్యక్రమంలో మాస్టార్లుకు వసూలు చేసిన నగదును అందజేశారు.

ఈ కార్యక్రమానికి వైద్యులు దేవరపల్లి రవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కొవిడ్ వల్ల పాఠశాలలు తెరవక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులకు పూర్వపు విద్యార్థులు నగదు సాయం చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సంచాలకులు ఎం.ఎం.కె.రాజు, బాబు, పూర్వపు విద్యార్థులు సుధాకర్, నిఖిత, రమేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి రోడ్డెక్కిన సినీ, టీవీ కళాకారులు.. ఆదుకోవాలని కలెక్టర్ కు వినతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.