Sharada Peetham: ముఖ్యమంత్రి జగన్ను విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి కలిశారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన స్వామిజీ.. శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వార్షికోత్సవాలు జరగనున్నాయని వివరించారు.
వార్షిక మహోత్సవాల్లో పాల్గొని శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆశీస్సులు పొందాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వెంట సీఎంను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు.
ఇదీ చదవండి: CM Jagan: మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేరబోతుంది: సీఎం జగన్